ప్రధాని మోడీ మరొక సంచలన నిర్ణయం – లాక్డౌన్ ఉల్లంగిస్తే జైలుకే…?

Friday, March 27th, 2020, 10:42:07 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయంకరంగా వ్యాపిస్తుంది. ఇప్పటికి చూసుకుంటే ఈ వైరస్ రోజు రోజు కి పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. మొత్తానికి చూసుకుంటే దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య దాదాపుగా 5,00,000 దాటింది. వీరిలో కరోనా భారీన పడి 24,070 మంది మరణించారు. ఇకపోతే మన దేశంలో కూడా ఈ వైరస్ కి సంబందించిన వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 45 కు చేరగా, ఏపీలో 11 మందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని అమలు చేసి ఈ కరోనా వైరస్ ని నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ ఈ లాక్ డౌన్ నిబంధనలను మాత్రం కొందరు ప్రజలు బేఖాతరు చేస్తున్నారు. లాక్ డౌన్ ని పట్టించుకోకుండా తమ ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు. దీనిపై ఆగ్రహించిన కేంద్రం మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. ఒకవేళ ఇప్పటి నుండి ఎవరైనా ఈ లాక్ డౌన్ ని ఉల్లంగిస్తే మాత్రం వారికి రెండేళ్లవరకు జైలు శిక్ష విధిస్తూ, జరిమానా కూడా విధిస్తామని ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కఠిన నిబంధనలను జారీ చేసింది. కాగా ఈ లాక్ డౌన్ నుంచి ఆసుపత్రులు, పాల డెయిరీలు, రేషన్ షాపులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, బ్యాంకులకు మినహాయింపు ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంతేకాకుండా ఈ లాక్ డౌన్ ని ఉల్లంగిస్తే సామూహిక వ్యాప్తి ద్వారా వైరస్ మరింతగా పెరిగే అవకాశం ఉందని, అందుకనే కష్టతరమైనప్పటికీ కూడా ఈ నిబంధనలను ప్రజలందరూ కూడా పాటించాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.