ప్రధాని మోడీ మారో సంచలన నిర్ణయం – ఈసారి ఏంటంటే…?

Friday, April 3rd, 2020, 10:18:53 AM IST

మన భారత ప్రధాని మోడీ తాజాగా మరొక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు… కాగా ప్రపంచాన్ని అంతటిని కూడా అతలాకుతం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ పై చేస్తున్నటువంటి భీకరమైన పోరులో మన భారత జాతి మొత్తం ఒక్కటిగా ఉందన్న విషయాన్ని మరొకసారి ప్రపంచానికి తెలియజేయాలని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వాఖ్యానించారు. ఈమేరకు నేడు ఉదయం ఆయన ఒక వీడియో సందేశాన్ని ప్రజలందరికి అందించారు. కాగా ఈ నెల 5వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో దాదాపుగా 9 నిముషాల సమయాన్నిప్రజలందరు కూడా కేటాయించాలని ప్రధాని మోడి వెల్లడించారు.

కాగా ఏప్రిల్ 5 వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలోని అన్ని లైట్లనూ ఆర్పివేయాలని, ఆపై వీధుల్లోకి రాకుండా, తలుపుల వద్ద కానీ, బాల్కనీలలో కానీ నిలబడి, వీలైనన్ని ఎక్కువ దీపాలను, కొవ్వొత్తులను కానీ మొబైల్ ఫోన్ల టార్చ్ లైట్లను, మాములు టార్చ్ లైట్లను కూడా అందరు కలిసి ఒక్కసారిగా వెలిగింది, మన జాతి సంకల్పం అంతా కూడా ఒక్కటే అన్న నినాదాన్ని ప్రజలందరికి తెలియజేయాలని, మన దేశ ప్రజలందరికి కూడా ప్రధాని మోడీ వెల్లడించారు. ఇకపోతే మన దేశంలోని 130 కోట్ల మంది ఈ పనిని చేస్తే, ప్రపంచానికి ఒక మంచి సంకేతం వెళ్తుందని, మన సంకల్ప బలాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేయాలని ప్రధాని మోడీ వెల్లడించారు.