ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ నుండి సిగ్నల్స్!

Friday, January 9th, 2015, 12:30:13 PM IST


ఇండోనేషియా నుండి సింగపూర్ వెళుతూ మార్గం మధ్యలో జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్స్ నుండి సిగ్నల్స్ వస్తున్నట్లు ఇండోనేషియా ఉన్నతాధికారులు శుక్రవారం పేర్కొన్నారు. కాగా ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషణను ముమ్మరం చెయ్యగా సముద్రం అడుగు భాగం నుండి సందేశాలు వస్తున్నట్లు గాలింపు బృందాలు పేర్కొన్నాయి.

ఇక బుధవారం నాడు విమానం తోకను సముద్రం అడుగు భాగంలో గుర్తించిన అన్వేషణ బృందాలు అక్కడే బ్లాక్ బాక్స్ కూడా ఉండి ఉండచ్చునని భావించి అధికారులకు సమాచారం అందించారు. కాగా ఈ సమాచారంతో బ్లాక్ బాక్స్ కోసం అన్వేషణను వేగవంతం చేసిన అధికారులు సాధ్యమైననత త్వరగా దానిని బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.