రాముడి పై సంచలన వ్యాఖ్యలు చేసిన పిడమర్తి రవి

Sunday, January 24th, 2021, 04:00:10 PM IST

తెలంగాణ రాష్ట్రం లో బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఎస్సీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బదులు ఇచ్చారు. అయితే బండి సంజయ్ వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో రాముడి పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. నిన్నా మొన్నటి నుండి చందాల దందా మొదలైంది అని, అయోధ్య రాముడి కి చందాలు ఇవ్వాలి అంటూ బీజేపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారు అని, రానున్న రోజుల్లో జై భీమ్, జై శ్రీరామ్ అనే నినాదాల మధ్య దేశం లో యుద్ధం జరగనుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే అసలు అయోధ్య రాముడు ఎక్కడ పుట్టాడో తెలవదు అని, ఇటీవల నేపాల్ ప్రధాని రాముడు తమ దగ్గరే జన్మించాడు అని అన్నారు అంటూ చెప్పుకొచ్చారు.అసలు రాముడు భారత దేశంలో పుట్టాడా, నేపాల్ లో పుట్టాడా జర్మనీ లో పుట్టాడా తేలాల్సి ఉంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంపీ బండి సంజయ్ ప్రజా సమస్యల పై మాట్లాడాల్సింది పోయి నిత్యం గుళ్ళు, గోపురాలు అంటూ తెరాస ను విమర్శించడం తగదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితులు హిందువులే అయితే ఆలయాల్లో కి ప్రవేశం ఎందుకు నిరాకరిస్తున్నారు అంటూ రవి సూటిగా ప్రశ్నించారు.