ఎవరెస్ట్ పైకి ‘హ్యూస్’ బ్యాట్!

Friday, December 26th, 2014, 05:47:00 PM IST


ఆస్ట్రేలియాలో బౌన్సర్ దెబ్బకు ప్రాణాలు విడిచిన క్రికెట్ ఆటగాడు ఫిల్ హ్యుస్ చివరిసారిగా ఆడిన బ్యాట్ ను ఎవరెస్ట్ శిఖరంపై ఉంచుతామని నేపాల్ క్రికెట్ అసోసియేషన్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు లేఖను రాసింది. కాగా ఫిల్ హ్యూస్ మృతికి నివాళిగా ఎవరెస్ట్ పై బ్యాట్ ఉంచడానికి నేపాల్ క్రికెట్ అసోసియేషన్ చేసిన ప్రతిపాదనను స్వాగతించామని, దీనిపై నేపాల్ క్రికెట్ జట్టుతో, పర్వతారోహకులతో చర్చలు జరుపుతున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ వ్యాలీ అడ్వర్డ్స్ పేర్కొన్నారు. అలాగే వచ్చే సీజన్ లో ఈ బ్యాట్ ను ఎవరెస్ట్ శిఖరంపైకి చేర్చనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ నేపధ్యంగా నేపాల్ ఆటగాళ్ళలో 63 ఓవర్ల మ్యాచ్ జరిపే ఆలోచనలో ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ పేర్కొన్నారు.