బిగ్ వైరల్: పెట్రోల్ రేటు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

Friday, October 30th, 2020, 05:08:31 PM IST

దేశంలో రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్పా తగ్గడం లేదు. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పెట్రోల్ ధరలు పెరిగిపోతుండడంపై తెలంగాణ కాంగ్రెస్ నేత గూడూరు నారాయణ రెడ్డి ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ముంబైలో ఓ పెట్రోల్ బంక్ యాజమాన్యం తమ రశీదులపై మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. పెట్రోల్ ధరలు తగ్గాలి అనుకుంటే మోదీకి ఓటు వేయకండని అందులో ఉంది. ఇదిలా ఉంటే పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలపై సామాన్యుల నుంచి ప్రభుత్వంపై కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది.