నిమ్మగడ్డ రమేష్ పై ఫిర్యాదు…ఎందుకంటే?

Wednesday, December 16th, 2020, 07:25:13 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై సూర్యారావు పేట లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు అయింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన కారణం గా ఫిర్యాదు నమోదు అయినట్లు తెలుస్తోంది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజా న్యాయ వేదిక అధ్యక్షుడు అయిన శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో ఉంటూనే విజయవాడ లో ఉంటున్నట్లు గాఇంటి అద్దె తీసుకున్నందుకు గానూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లో పేర్కొన్నారు.

అయితే గతం లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ ఈ వ్యవహారం పై ఫిర్యాదు నమోదు కావడం పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తున్న తరుణం లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కి సిద్దం గా లేదు అని, సమస్యలు తలెత్తుతాయి అంటూ చెప్పుకొస్తోంది. తాజాగా నిమ్మగడ్డ రమేష్ పై ఫిర్యాదు నమోదు కావడం తో మరొకసారి హాట్ టాపిక్ గా మారారు.