వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పై హైకోర్టు లో పిటిషన్..!

Wednesday, August 26th, 2020, 11:35:26 PM IST


అధికార పార్టీ వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ సదరు పిటిషనర్ పేర్కొన్నారు. రాజుపాలెం లోని కోట నెలమపురి, కొండమోడు గ్రామాల్లో మైనింగ్ జరిగింది అని నాగ రఘు పిటిషన్ వేశారు. వైట్ లైమ్ స్టోన్, మొజాయిక్ చిప్స్ అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ పిటిషన్ లో తెలపడం జరిగింది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో సీబీఐ విచారణ జరిపించాలి అని హైకోర్టు ను కోరడం జరిగింది

రాజకీయ దురుద్దేశం తోనే పిటిషన్ వేశారు అని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించగా, న్యాయస్థానానికి పూర్తి వివరాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది అని నాగరఘు తెలిపారు. అయితే ఈ దీని పై న్యాయస్థానం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ మైనింగ్ పై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అంతేకాక తదుపరి విచారణ ను వచ్చే నెలకు వాయిదా వేయడం జరిగింది. అయితే అధికారం లో ఉన్న ఎమ్మెల్యే పై ఇటువంటి ఆరోపణలు రావడం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఈ టాపిక్ చర్చంశనీయం గా మారింది.