ఆదిపురుష్ చిత్రం పై కోర్టు లో పిటిషన్…అసలు కారణం ఇదే

Thursday, December 17th, 2020, 02:30:15 PM IST

పాన్ ఇండియన్ సినిమాల హీరో ప్రభాస్ చిత్రం ఆదిపురుష్ చిత్రం దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. అయితే ఇందులో హీరో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, రావణుడి పాత్ర కోసం దర్శకుడు ఓం రౌత్ సైఫ్ అలీఖాన్ ను తీసుకోవడం జరిగింది. అయితే ఇటీవల తన పాత్ర గురించి సైఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు సైఫ్ అలీఖాన్. అయితే తాజాగా సైఫ్ చేసిన వ్యాఖ్యలకు గానూ యూపీ కి చెందిన న్యాయవాది హిమన్షూ శ్రీ వాస్తవ జౌన్ పూర్ కోర్టు లో పిటిషన్ దాఖలు అయింది.

రావణుడు పై సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు హిందూ మత విశ్వాసాలను దెబ్బ తీసేలా ఉన్నాయి పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ లో సైఫ్ అలీఖాన్ పేరు తో పాటుగా, దర్శకుడు ఓం రౌత్ పేరు ను సైతం చేర్చారు. అయితే సైఫ్ అలీఖాన్ క్షమాపణలు చెప్పినప్పటికీ ఈ చిత్రం పై పలువురు ప్రముఖులు, నెటిజన్లు విమర్శలు చేస్తూనే ఉన్నారు.