ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య

Saturday, December 26th, 2020, 03:27:05 PM IST

ఆర్ధిక లావాదేవీల్లో వచ్చిన తేడాల కారణంగా బీజేపీ నేత నెల్ల వెల్లి రామారావు పై వైరా ప్రాంతానికి చెందిన మాడపాటి రాజేష్ కత్తి తో దాడి చేశాడు.ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికం గా కలకలం రేపుతోంది. అయితే బాధితుడి కి తీవ్ర గాయాలు కావడం తో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రి లో చికిత్స పొందుతూ రామారావు తుది శ్వాస విడిచారు. అయితే మృతుడు రామారావు బీజేపీ కి చెందిన నాయకుడు అని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటన పై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అంతేకాక బీజేపీ నేత హత్యకు గురి కావడం తో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఖమ్మం లో జరిగిన ఈ ఘటన పై పలువురు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.