ఏపీ మంత్రి పేర్ని నాని పై దాడికి యత్నం

Sunday, November 29th, 2020, 12:36:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పై దుండగుడు దాడికి యత్నించాడు. ఆదివారం నాడు ఉదయం మంత్రి పేర్ని నాని కాళ్ళకి తాపీ మేస్త్రి నాగేశ్వర రావు దండం పెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అతని వద్ద ఉన్న పదునైన తాపితో దాడికి తెగబడ్డాడు. అయితే అప్రమత్తం అయిన అనుచరులు వెంటనే అతన్ని అడ్డుకున్నారు. అయితే దాడి జరగడం పట్ల వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టుకున్న ఆ దుండగుడు ను పోలీసులకు అప్పగించారు. అయితే ఈ విషయం పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.