బిగ్ న్యూస్: ఆ విషయం ను కేసీఆర్ నే అడగమంటున్న మంత్రి పేర్ని నాని

Friday, October 2nd, 2020, 12:40:47 AM IST


కరోనా వైరస్ మహమ్మారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అయితే కరోనా వైరస్ భారిన పడి మృతి చెందిన ఆర్టీసి కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పిస్తాం అని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అయితే విజయవాడ లో మృతి చెందిన ఆర్టీసి ఉద్యోగుల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. అయితే అనంతరం మీడియా తో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతరాష్ట్ర బస్సు సర్వీసు అంశం పై మంత్రి స్పందించారు. అంతరాష్ట్ర ఆర్టీసి బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయి అనేది అంతులేని ప్రశ్న గా మారింది అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల మద్య బస్సులు ఎప్పుడు నడుస్తాయి అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నే అడగండి అంటూ మీడియా వారికి పేర్ని నాని సూచించారు. ఇటీవల ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించినా సమస్య ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే త్వరలోనే చర్చలు జరిపి, సమస్యకి తగు పరిష్కార చర్యలు తీసుకొనే వీలు ఉన్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.