వయసుకు తగ్గ మాటలు మాట్లాడు.. చంద్రబాబుకు మంత్రి పేర్ని నాని కౌంటర్..!

Friday, December 18th, 2020, 03:00:32 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు వయసుకు తగ్గట్టు మాట్లాడటం లేదని, ఆయన పోరాటమంతా తనయుడు లోకేష్ కోసమేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి చెడు చేసే విధంగా కాకుండా మంచి చేసేలా చంద్రబాబు వ్యవహరించాలని పేర్ని నాని సూచించారు. సీఎం జగన్ అన్ని విధాల ఆలోచించే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని దానికి కావాలని అడ్డుపడడం మంచిది కాదని అన్నారు.

అయితే తమకు చంద్రబాబు నాయుడు ఇచ్చే దొంగ సర్టిఫికెట్ అవసరం లేదని, గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. భవిష్యత్‌లో టీడీపీ మట్టి కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. రాజధానిలో ఆందోళన చేస్తున్న వారు భూమి వద్దు ప్లాట్లు కావాలని అడుగుతున్నారని అలాంటి వారు రైతులు ఎలా అవుతారని ప్రశ్నించారు.