బిగ్ న్యూస్ : రెండు రాష్ట్రాలకు పవన్ భారీ విరాళం.!

Thursday, March 26th, 2020, 09:58:56 AM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వైఫల్యం చెందినా వ్యక్తిగా మాత్రం తాను ఎప్పుడూ అందనంత దూరంలోనే ఉంటారని చెప్పాలి. తాను రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఎందరికో సాయం చేశారు.తెలిసినవే చాలా ఉన్నా తెలీకుండా చేసినవి కూడా అనేకం ఉండే ఉంటాయని పవన్ సన్నిహితులు చెప్తుంటారు.అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఎంతో మందికి ఎన్నో కోట్లి దారాదత్తం చేసేసారు.

ఇప్పుడు అలా మరోసారి తన దయాగుణాన్ని చాటుకున్నారు.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి కాపాడేందుకు తన వంతు సాయంగా రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమ నిధికి 50 లక్షల చొప్పున విరాళం ప్రకటిస్తున్నానని అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ నిధికి కూడా ఒక కోటి రూపాయాలు కూడా విరాళం ఇస్తున్నట్టుగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.గతంలో విశాఖ కు హుద్ హుద్ తుఫాను వచ్చినపుడు కూడా 50 లక్షల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే..