అన్నయ్య శ్రీ చిరంజీవి గారు సత్వరమే కోలుకోవాలి – పవన్ కళ్యాణ్

Tuesday, November 10th, 2020, 03:32:12 PM IST

ఆచార్య షూటింగ్ లో పాల్గొనే నిమిత్తం కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కున్న మెగాస్టార్ చిరంజీవి గారికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన విజయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఎటువంటి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ అని రావడం తో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు.

అన్నయ్య శ్రీ చిరంజీవి గారు లాక్ డౌన్ ప్రకటించినప్పటినుండి ఎన్నో జాగ్రత్త చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించారు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజారోగ్యం పై ఎంతో అవగాహన ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అని, కానీ కరోనా సోకడం తో తామంతా విస్తుపోయాము అని పవన్ కళ్యాణ్ తెలిపారు. అన్నయ్య త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.