శ్రీ జగన్ రెడ్డి గారి నిర్ణయంని జనసేన స్వాగతిస్తోంది – పవన్ కళ్యాణ్

Friday, September 11th, 2020, 03:00:48 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తూర్పు గోదావరి జిల్లా లో అంతర్వేది రథ దగ్ధం ఘటన పై సీబీఐ దర్యాప్తు కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరటం అంటే పరిష్కారం అయినట్టు కాదు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి వేసిన తొలి అడుగు మాత్రమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి నిర్ణయం నీ జన సేన స్వాగతీస్తోంది అని తెలిపారు. అయితే అంతర్వేది రథం దగ్ధం ఘటన కే సీబీఐ పరిమితం కారాదు అని, పిఠాపురం లో దేవతా విగ్రహాల ద్వంసం, కొండబిత్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సీబీఐ నిగ్గు తేల్చాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అయితే ఈ మూడు దుశ్చర్యలు ఒకేలా ఉన్నాయి అని, కాబట్టి పిఠాపురం, కొండ బిత్రగుంట లోని ఘటనల్ని సీబీఐ పరిధి లోని తీసుకువె ళ్ళంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.అయితే వీటితో పాటుగా తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించి కూడా సీబీఐ ఆరా తీయాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.