హాట్ టాపిక్ : రాజధాని విషయంలో కూడా పవన్ విజన్ మాములుగా లేదు..!

Sunday, August 2nd, 2020, 09:02:13 AM IST

ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో రాజధాని అంశమే పెను దుమారం రేపుతున్న హాట్ టాపిక్. ఇప్పుడు అమరావతి రాజధాని కాస్తా విశాఖకు ఆమోదం రావడంతో ఒక్కసారిగా ఏపీ మరోసారి భగ్గుమంది. అయితే ఈ విషయంలో మాత్రం ఏపీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలలో మొదటి నుంచి ఒకే స్టాండ్ లో ఉంది మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి.

ఎప్పుడో 2015 లోనే రాజధాని భూముల విషయంలో పవన్ అందరినీ హెచ్చరించారు. పైగా ఆ సమయంలో పవన్ మాటలు విని అంతా నవ్వారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం అలాగే మారిపోయింది.అప్పుడు వరకు ఎందుకు గత 2019 వరకూ కూడా రాజధానిగా అమరావతి నే ఉంచి కొనసాగిస్తామని చెప్పారు. వారు మాట మార్చేశారు.

టీడీపీ నాయకులు కూడా ఉన్నారు కానీ భారీ ఎత్తున భూసేకరణ చేసి ప్రజల్లో వారు ఇప్పుడు విలన్ అయ్యారు. పైగా వారి అనుకూల మీడియాతో ఇందులోకి పవన్ ను ఇరికించాలని చూస్తున్నారు. మరి ఇది కూడా వారిలోని మార్పే కదా? సో మొదటి నుంచి పవన్ ఒక్కడే రాజధాని విషయంలో ముందుచూపు మరియు ఒకే స్టాండ్ తో ఉన్నాడని చెప్పాలి.