నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన

Wednesday, December 2nd, 2020, 09:29:06 AM IST

జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు బయలుదేరారు. కొద్ది సేపట్లో గన్నవరం విమానాశ్రయం కి చేరుకోనున్న పవన్ కళ్యాణ్, అనంతరం కంకిపాడు మీదుగా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉయ్యూరు, పామర్రు మరియు అవనిగడ్డ మీదుగా భట్టి ప్రొలు, చావలి, తెనాలి వైపు ఈ పర్యటన ఉండనుంది. అయితే ఇప్పటికే తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ పర్యటన మరొకసారి రాష్ట్రం లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే అసెంబ్లీ లో తీవ్ర స్థాయిలో టీడీపీ వైసీపీ ల మధ్య ఇదే అంశం పై మాటల యుద్దాలు నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పర్యటన తో రైతులు, అధికార మరియు ప్రతి పక్ష పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.