పుట్టిన రోజు శుభాకాంక్షలు స్వీకరించడానికి మనస్సు సన్నద్ధం గా లేదు – పవన్ కళ్యాణ్

Wednesday, September 2nd, 2020, 10:00:14 PM IST


పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని నేడు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు భారీ గా పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. అయితే ఈ విషెస్ పై పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ ప్రజలు చిగురుటాకు ల్లాగ వణికిపోతున్నారు అని తెలిపారు. ప్రజలు, పోరాటం చేస్తున్న వైద్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు అని, కొందరు ప్రాణాలు విడుస్తున్నారు అని తెలిపారు.

అయితే ఇపుడున్న సమయం లో దేవుణ్ణి ప్రార్థించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అని తెలిపారు. అయితే ఇటువంటి నేపధ్యం లోనే చాతుర్మాస్య దీక్ష ను చేస్తున్న విషయాన్ని తెలిపారు. ప్రతి ఏటా చేస్తున్నదే అయినా, ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి నుండి ప్రజలను కాపాడమని భగవంతుణ్ణి వేడుకోవడం కోసం అని పవన్ ప్రక టన లో తెలిపారు. అయితే ఇలాంటి సమయంలో నా పుట్టిన రోజు వచ్చినా శుభాకాంక్షలు స్వీకరించేందుకు నా మనస్సు సన్న ద్దం గా లేదు అని తెలిపారు. అయితే తనకి విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరునా వినపూర్వక కృతజ్ఞతలు అని పవన్ పేర్కొన్నారు. మీ ప్రేమాభిమానాలు బాధ్యతను మరింతగా పెంచాయి అని, ఈ పరిస్థతి పోయి, సాధారణ స్థితి వచ్చిన అనంతరం మీ ముందుకు వస్తా అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.