బిగ్ న్యూస్: తెలంగాణ బీజేపీ పై పవన్ ఆగ్రహం…తెరాస ఎమ్మెల్సీ అభ్యర్దికి మద్దతు

Sunday, March 14th, 2021, 01:12:36 PM IST

తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అటు అధికార తెరాస కి, ప్రతి పక్ష పార్టీలకు కీలకం కానున్న సంగతి తెలిసిందే. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ కి మద్దతు తెలిపిన జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆ పార్టీ పై గుర్రు గా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కూతురు కి మద్దతు ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే తెలంగాణ బీజేపీ జన సేన పార్టీ ను చులకన గా చూసింది అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్రం మాతో ఉన్నా, తెలంగాణ బీజేపీ కుట్ర చేసింది అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత నేత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు అయిన వాణీ దేవి కు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే వాణీ దేవి తెలంగాణ అధికార పార్టీ అయిన తెరాస తరపున మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం పట్ల బీజేపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.