సీమ స్లాంగ్ లో పవన్ కళ్యాణ్ సూపర్ డైలాగులు

Saturday, February 4th, 2017, 09:45:00 AM IST


పవన్ కళ్యాణ్ సినిమాలకి అదనపు హంగులు ఏమీ ఉండవు. అతనే తన సినిమాకి మెయిన్ అట్రాక్షన్ గా నిలవడం అతనికి అలవాటు. ప్రతీ సినిమాలో ఎదో ఒక పాయింట్ చుట్టూ కథ తిరుగుతూ ఉన్నా కొన్ని ట్రేడ్ మార్క్ కామెడీ , ఫైట్ ల వలన అతని సినిమాకి సూపర్ కవరేజ్ , మైలేజీ కనిపిస్తుంది. డాలీ డైరెక్షన్ లో తెరమీదకి రాబోతున్న కాటమరాయుడు సినిమాకి ఇప్పటికే సూపర్ హైప్ ఏర్పడింది. పవన్ కూడా పర్సనల్ గా చాలా కేర్ తీసుకుంటున్న ఈ సినిమాలో పవన్ రాయలసీమ హీరోగా కనిపిస్తాడు. సీమ స్లాంగ్ విషయంలో పవన్ చాలా కేర్ తీసుకుంటున్నాడట కూడా. ఇప్పటివరకూ షూటింగ్ పార్ట్ వరకే జరిగినా.. డబ్బింగ్ సమయానికి వచ్చేసరికి కంప్లీట్ గా రాయలసీమ యాసలో మాట్లాడి.. తూటాలు పేల్చనున్నాడట పవన్.