జగన్‌రెడ్డి ప్రభుత్వానికి అంత భయమెందుకు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!

Wednesday, January 6th, 2021, 03:04:28 AM IST


ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను నిరసిస్తూ నేడు బీజేపీ మరియు జనసేన పార్టీ శ్రేణులు రామతీర్థం దర్మయాత్రకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పలువురు నేతలను పోలీసులు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మరి కొందరిని గృహ నిర్భంధం చేశారు. అయితే దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ రామతీర్థ ధర్మయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు.

అయితే రామతీర్థం సందర్శనకు వెళ్తే సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రామతీర్థం చేరుకోని నిరసన తెలిపామని అన్నారు. ప్రజాస్వామ్యంలో భావవ్యక్తీకరణ, నిరసన తెలపడం ప్రతి ఒక్కరి హక్కు అని నిరసన తెలిపే హక్కును సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వం హరించి వేస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని, ఇకనైనా ప్రభుత్వం దోషులను పట్టుకోని కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.