ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి – పవన్ కళ్యాణ్

Monday, February 22nd, 2021, 07:29:24 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయం లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం పట్ల జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కి ముందుగా ఎక్కడ అయితే ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుండే కొనసాగించనున్నట్లు ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ పవన్ విజ్ఞప్తి చేశారు. అయితే లాక్ డౌన్ ముందు జరిగినటువంటి నామినేషన్ల ప్రక్రియ లో అక్రమాలు చోటు చేసుకున్నాయి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే జన సేన పార్టీ కి చెందిన నేతలను బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రలోభాలు, బెదిరింపులు కారణంగా నామినేషన్లు వేయని వారికి మరొకసారి అవకాశం కల్పిస్తాం అని ఎన్నికల సంఘం చెప్పినప్పటికీ, అది అమలు అయ్యే అవకాశం కనిపించడం లేదు అని పవన్ విమర్శించారు.

అయితే తమ పార్టీ ఆధారాలతో అధికారులను కలిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు అని వ్యాఖ్యానించారు. అయితే కలెక్టర్లు తమ కింది స్థాయి అధికారుల తో పేరుకే ఫిర్యాదులు తీసుకొని పంపిస్తున్నారు తప్ప, చిత్త శుద్ధితో ఆలోచించడం లేదు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారుల తీరుతో ఆ ప్రక్రియ పై నమ్మకం పోయింది అని, అయితే ఫిర్యాదుల వరకూ న్యాయం చేస్తామని రమేష్ కుమార్ ఇచ్చిన హామీ అమలయ్యే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు అని వ్యాఖ్యానించారు.కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తే తప్ప న్యాయం జరగదు అంటూ పవన్ స్పష్టం చేశారు. అంతేకాక జన సేన పార్టీ లీగల్ విభాగం తో చర్చలు జరిపామని, హైకోర్టు కి అప్పీల్ చేస్తామని పవన్ ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.