విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక ఒత్తిడి లో ఉన్నారు – పవన్ కళ్యాణ్

Tuesday, October 13th, 2020, 02:06:45 AM IST


కరోనా వైరస్ మూలాన స్కూళ్లు, కాలేజ్ లు అన్ని కూడా మూత బడిపోయాయి. అయితే ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహణపై, విద్యార్థుల్లో, తల్లి దండ్రుల లో ఆందోళన నెలకొని ఉంది అని జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషయాల్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉన్నత విద్య మండలి పరిగణన లోకి తీసుకోవాలి అని తెలిపారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షలకు తగు విధమైన సమాచారం ఇవ్వకుండా షెడ్యూల్ ప్రకటించి ఏర్పాట్లు చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఇప్పటికీ కూడా వేల సంఖ్యలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వస్తున్నాయి అని, ఈ ఇబ్బందికర పరిస్తితుల్లో పరీక్షలకు వెళ్ళాలి అంటే భయంగా ఉంది అని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జన సేన పార్టీ దృష్టికి తీసుకు వచ్చిన విషయాన్ని తెలిపారు. మానసిక ఒత్తిడి లో ఉన్న విద్యార్థుల గురించి ఆలోచించాలి అని సూచించారు. అంతేకాక ఈ పరీక్షల నిర్వహణ కి ఇతర రాష్ట్రా లు అనుసరిస్తున్న విధానం ను అవలంబించాలి అని పవన్ పేర్కొన్నారు.