బిగ్ న్యూస్ : జగన్ సర్కార్ కు పవన్ మరో విన్నపం.!

Sunday, July 5th, 2020, 08:55:46 PM IST

ఏపీ రాజకీయ వర్గాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనదైన పాత్ర పోషిస్తున్నారని చెప్పాలి. ఎంతసేపు విమర్శలు మాత్రమే కాకుండా జనరంజకమైన నిర్ణయాలు తీసుకుంటే మిగతా పార్టీ నేతల్లా కాకుండా బాహాటంగా ప్రసంసిస్తున్నారు. అంతే కాకుండా వీటితో పాటుగా తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను ప్రభుత్వ దృష్టిలోకి తీసుకువస్తున్నారు.

అలాగే ఇప్పుడు జగన్ సర్కార్ కు తన దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించాలని సూచించారు. కరోనా కష్ట కాలంలో చాలా మంది ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలా ఎదుర్కొంటున్న వారిలో జగన్ హామీ ఇచ్చిన న్యాయవాదులు కూడా ఉన్నారు అని పవన్ ఈరోజు తెలిపారు. గత నాలుగు నెలల నుంచి “లా నేస్తం” పేరిట జగన్ ఇచ్చిన హామీ పథకం తాలూకా బెనిఫిట్ ను ఎందుకు ఆపేసారని ప్రశ్నించారు.

వారు కూడా ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ నాలుగు నెలల నుంచి వారికి అందిస్తున్న 5 వేల రూపాయలు ఆర్ధిక సాయాన్ని నిలిపివేయడం సమంజసం కాదని పవన్ తెలిపారు. అంతే కాకుండా జూనియర్ న్యాయ వాదులు సంక్షేమం కోసం కేటాయిస్తామన్న 100 కోట్ల రూపాయల జీవో ను కూడా ఇస్తామన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇప్పటి వరకు ఆచరణలోకి తీసుకురాలేదని జగన్ ప్రభుత్వం ఎందుకు ఇలా చేశారో వారికి వివరణ ఇచ్చి వారి సమస్యను పరిష్కరించాలని పవన్ జగన్ సర్కార్ ను ప్రశ్నించి విన్నవించారు.