ప్రలోభాలకు లోనై ఓట్లేస్తే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయి–పవన్ కళ్యాణ్

Thursday, February 13th, 2020, 04:08:06 PM IST

పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రాజకీయ నాయకుల ఫై నే విమర్శలు చేస్తారు. అయితే కర్నూల్ రెండో రోజు పర్యటనలో పవన్ ప్రజలనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రలోభాలకు లోనై ఓట్లేస్తే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. జొహరాపురం వంతెన ని సందర్శించిన పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధుల వైఖరి ఫై అసహనం వ్యక్తం చేసారు. చిన్నపాటి వంతెన కూడా నిర్మించలేకపోతే ఏమి ప్రయోజనమని అన్నారు. ప్రజలు సమస్యలని తమ దృష్టికి తీసుకొస్తున్నారు గాని, ప్రజలు ఎన్నికల సమయంలో మాత్రం బాధ్యతగా ఉండేవారిని ఎన్నుకోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు.

ప్రజాప్రతనిధుల గొడవ కారణంగా వంతెన నిర్మాణం ఆగిపోవడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులని ఎన్నుకొనే ముందు ప్రజలు బాగా ఆలోచించుకోవాలని హితబోధ చేసారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థ మనకి అవసరమా? అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానుల సంగతి తర్వాత గాని, ముందు జొహరాపురం బ్రిడ్జి లాంటి చిన్న సమస్యలని పరిష్కరించాలని కోరారు పవన్. ప్రలోభాలకు లోబడి ప్రజా ప్రతినిధులని ఎన్నుకుంటే వారికి పని చేయాలన్న ఆసక్తి ఏముంటుందని సంచలన వ్యాఖ్యలు చేసారు. డబ్బులు పడేశాం, మీరు అడిగిందని ఇచ్చేశాం అంటూ అసహనం వ్యక్తం చేసారు. మీకు పని చేయాల్సిన అవసరం ఏముంటుందనే నిర్లక్ష్యం వస్తుందని పవన్ అన్నారు. అయితే ఇది ఒక్క కర్నూల్ ప్రాంతానికి చెందినది మాత్రమే కాదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి వర్తిస్తుందని పవన్ తెలిపారు.