పవన్ కళ్యాణ్ నిరసన దీక్ష…వారికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్

Monday, December 7th, 2020, 12:59:09 PM IST

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పర్యటించిన సంగతి తెలిసిందే. నివర్ తుఫాన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పవన్, రైతులను పరామర్శించడం జరిగింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని నిరసన దీక్ష చేపట్టారు. రైతులను పరార్శించిన పవన్ కళ్యాణ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.బాధిత రైతులకు పరిహారం చెల్లించాలి అంటూ చేస్తున్న ఈ దీక్ష నేడు సాయంత్రం వరకు కొనసాగనుంది.

నష్టపోయిన ప్రతి రైతుకూ కూడా 35 వేల రూపాయలు ఇవ్వాలని, తక్షణ సహాయం గా 10 వేల రూపాయలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుండి సరైన విధంగా స్పందన లేకపోవడం తో పవన్ దీక్ష చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే రైతులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు జన సేన పార్టీ,మరియు బీజేపీ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ఈ రిలే నిరాహార దీక్షలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ దీక్షలకు ఇప్పటికే భారతీయ కిసాన్ సంఘ్ రైతు సంఘం మద్దతు తెలిపింది. అయితే వైసీపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ తీరు పట్ల విమర్శలు చేస్తున్నారు.