వారిని ఆదుకోండి.. వైసీపీ సర్కార్‌కు పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్..!

Thursday, October 22nd, 2020, 05:47:57 PM IST

వైసీపీ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్ వినిపించారు. ఏపీలో కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయారని, వారికి పెట్టుబడి మొత్తాన్ని పరిహారంగా తక్షణమే చెల్లించాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. గత ఏడాది కూడా రైతులకు ప్రభుత్వం పంటనష్టం ఇవ్వలేదని ఇప్పుడు కూడా ఇవ్వకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అయితే భారీ వర్షాల కారణంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ఈ జిల్లాలలో పర్యటించి ముంపులో ఉన్న పొలాలను పరిశీలించిన జనసేన నాయకులు రైతులను పరామర్శించారు. ప్రాథమిక అంచనాల ప్రకారమే 2.71 లక్షల ఎకరాలలో పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, వాస్తవంగా ఇంకా ఎక్కువగానే పంట నష్టం జరిగి ఉంటుందని జనసైనికులు తెలిపారు. దీంతో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదని, పంట నష్టం అంచనాలను రూపొందించే ప్రభుత్వం పరిహారాన్ని అందించడంలో ఏమీ పట్టనట్లు ఉందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.