జగన్ సర్కార్‌కి పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్.. ఏమిటో తెలుసా?

Friday, March 27th, 2020, 01:30:56 AM IST

కరోనా వైరస్ వేగంగ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు లాక్‌డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొందరు రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

అయితే రైతుల సమస్యలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో మామిడి రైతులను ఆదుకోవాలని సీఎం జగన్‌కి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సరిహద్దులు, మార్కెట్లు మూసివేయడంతో మామిడి రైతులలో నష్టాల పాలవుతామనే తీవ్ర ఆందోళన నెలకొని ఉందని, దీనికోసం ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే స్వయం సహాయక సంఘాల రుణాల చెల్లింపును కూడా జూన్ వరకూ వాయిదా వేసేలా కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇకపోతే ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అండగా ఉంటుందని అన్నారు.