మెట్రో లో ప్రయాణించిన పవన్ కళ్యాణ్

Thursday, November 5th, 2020, 10:39:25 AM IST

జన సేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ మెట్రో లో ప్రయాణం చేశారు. హైదరాబాద్ లో మాదాపూర్ నుండి మియాపూర్ వరకు పవన్ మెట్రో లో ప్రయాణించడం జరిగింది. అయితే మియాపూర్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ షూటింగ్ నిమిత్తం పవన్ కళ్యాణ్ మియాపూర్ వెళ్ళడం జరిగింది. అయితే పవన్ మెట్రో లో ప్రయాణించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

పవన్ వకీల్ సాబ్ షూటింగ్ బ్రేక్ లలో సైతం శ్రీముఖి మరియు జాని మాస్టర్ లతో దిగిన ఫోటోలు కూడా వైరల్ అవ్వగా, నేడు మెట్రో ప్రయాణం కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే వకీల్ సాబ్ నుండి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లు విడుదల అయినప్పటి నుండి అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లుక్ చూసి, స్టైలిష్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.