బిగ్ న్యూస్: రాజధాని వికేంద్రీకరణ పై పవన్ సంచలన వ్యాఖ్యలు

Sunday, August 2nd, 2020, 08:52:48 PM IST

Pawan-Kalyan-on-Corona

అభివృద్ది వికేంద్రకరణ పేరిట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మూడు రాజధానుల కి రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం రాజధాని గా ఎంచుకున్న అమరావతి ప్రాంత రైతులు మాత్రం, గవర్నర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పై పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.అమరావతి రైతుల కోసం టీడీపీ, వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల పై జనసే న రాజకీయ వ్యవహారాల కమిటీ నేడు చర్చించగా, పవన్ మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా,.గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే లు రాజీనామా చేయాలి అని, అమరావతి పై ప్రత్యక్ష పోరాటం లోకి రావాలి అని, రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు జన సేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే పవన్ గతం లో చేసిన వ్యాఖ్యలను మరొకసారి గుర్తు చేశారు. రైతు కన్నీరు పై రాజధాని నిర్మాణం వద్దు అని మొదటి నుండే చెబుతున్నాం అని అన్నారు. ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఈ రాజధాని క్రీడ మొదలు పెట్టారు అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అయితే ఈ వ్యవహారం పై న్యాయవాదులతో, నిపుణులతో చర్చలు జరుపుతామని అన్నారు.