గమనం చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన పవన్

Wednesday, November 11th, 2020, 12:08:22 PM IST

గమనం చిత్రం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుజనా రావు దర్శకత్వం వహిస్తున్నారు. గమనం సినిమా తెలుగు ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉదయం 9:09 గంటలకు విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ తో కలిసి వీక్షించారు. మూడు విభిన్న కథలతో తెరకెక్కిన ఈ గమనం ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈ సినిమా లో శ్రియ శరణ్, నిత్యా మీనన్ మరియు ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు తో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రూపొందిస్తున్నారు.ఇప్పటికే విడుదల అయినా ఈ చిత్ర పోస్టర్లు సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హిందీ లో సోనూ సూద్, తమిళం లో జయం రవి, కన్నడ లో శివరాజ్ కుమార్,మలయాళం లో ఫాహద్ ఫసిల్ సోషల్ మీడియా వేదిక గా ట్రైలర్ ను విడుదల చేసారు. అయితే ఈ చిత్రానికి ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు సమకూరుస్తున్నారు.