రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!

Thursday, December 3rd, 2020, 07:30:54 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు అనుగుణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల మేలు కోసమే కేంద్రం కొత్త చట్టాలను తీసుకొచ్చిందని అన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల్లో లోపాలుంటే రైతులు, ప్రభుత్వం చర్చించి పరిష్కరించుకోవాలని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కాదు కావాల్సింది లాభసాటి ధర అని అన్నారు.

అయితే పంట నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు 35 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ లక్ష్యమని అన్నారు. అయితే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై కూడా స్పందించిన పవన్ కళ్యాణ్ రజనీకాంత్‌ ఎప్పటి నుంచో రాజకీయాలపై ఫోకస్ పెట్టారని, బలమైన ఆలోచనతో వస్తున్న నేతలను స్వాగతించాల్సిదేనని అన్నారు. అలాంటి వ్యక్తులు విజయవంతం కావాలని కూడా కోరుకుంటున్నట్టు తెలిపారు.