ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకొని ఉండాలా?

Wednesday, November 18th, 2020, 01:37:29 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజదాని అమరావతి అంశం పై జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమ కారుల పై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే బంగారం పెట్టుకొని ఉద్యమం చేయకూడదా, ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకొనే ఉండాలా అంటూ అధికార పార్టీ వైసీపీ కి దిమ్మతిరిగే ప్రశ్నలు వేశారు. అయితే అమరావతి పరిరక్షణ సమితి నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ రాజధాని అంశం పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

అయితే ఉద్యమానికి సామాజిక వర్గం కి ముడి పెట్టడం సరికాదు అని పవన్ కళ్యాణ్ అభిప్రాయ పడ్డారు. అయితే రాజధాని ను మూడు ప్రాంతాల సమస్య గా మార్చి వేశారు అని రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అమరావతి రైతులకు తన మద్దతు ఎప్పుడు ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం లో అన్నారు. రైతులకు న్యాయం చేసే విషయం లో వెనకడుగు వేసేది లేదు అని, రాజధాని గా అమరావతి ఉంటుంది అని బీజేపీ తనకు స్పష్టం చేసింది అంటూ పవన్ అన్నారు. అయితే రాజధానిని తరలిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు అని, అయితే నిర్ణయం తీసుకున్న తర్వాత తమ కార్యాచరణ వెల్లడిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.