పవన్ కళ్యాణ్ మ్యానియా మళ్లీ మొదలయ్యేనా?

Sunday, November 1st, 2020, 09:00:06 PM IST

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ అభిమానులను పలకరించేందుకు వకీల్ సాబ్ తో మన ముందుకు రానున్నారు. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణం గా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడటం మాత్రమే కాకుండా, దసరా కి విడుదల కావాల్సిన సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు. అయితే నవంబర్ 1 నుండి పవన్ కళ్యాణ్ మళ్లీ ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి, సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే,ఇటు వరుస చిత్రాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఓటిటీ బాట పట్టిన సినిమాలు చాలా వరకు కూడా నష్టాలను చవి చూశాయి. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి సైతం మంచి రేటు వచ్చినా, ఓటిటీ లో విడుదల చేసేందుకు నిర్మాతలు నిరాకరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దియేటర్లకు వెళ్ళాలి అంటే అది కష్టమనే చెప్పాలి. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ కి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ మ్యానియా మళ్లీ మొదలవతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.