పవర్ తుఫాన్ మొదలైంది… యాక్షన్ లోకి దిగిన పవన్!

Tuesday, January 26th, 2021, 03:09:52 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ ఏడాది ఫుల్ ఫెస్టివల్ అని చెప్పాలి. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్, అయ్యప్పనమ్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఇప్పటికే పూర్తి కాగా, షూటింగ్ షురూ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కి సంబంధించిన ఒక వీడియో ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

పవన్ కళ్యాణ్ బులెట్ ను డ్రైవ్ చేస్తూ వెళ్తున్న సీన్స్ ను షూట్ చేశారు. పవన్ సింపుల్ గా, పవర్ ఫుల్ లుక్ తో కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే తో పాటుగా, సంభాషణలు కూడా రాయనున్నారు. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రం లో హీరోయిన్ ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సాయి పల్లవి లీడ్ రోల్ లో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2021 లో నే విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఒకే ఏడాది పవన్ సినిమాలు రావడం పట్ల అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.