2024 కంటే ముందే ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Thursday, November 19th, 2020, 02:06:33 AM IST


దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా? 2024 కంటే ముందే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్నికలకు సిద్దం కాక తప్పదా? అంటే అవునన్న సమాధానాలే గతకొద్ది రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జమిలి ఎన్నికల ప్రతిపాదనను తీసుకువచ్చింది. అయితే కేంద్రంతో పాటు, అన్ని రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నమాట. అయితే జమిలి ఎన్నికలకు ఇప్పటికే అనేక రాష్ట్రాల నేతలు, పార్టీలు మద్ధతును కూడా ప్రకటించాయి.

అయితే తాజాగా జమిలి ఎన్నికలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో 2024 కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అననరు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు రావాలన్నది తన అభిప్రాయమని, చాలా రాష్ట్రాలు కూడా ఇదే కోరుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా దేశంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్టు మాట్లాడాడు.