ధర్మ పరిరక్షణ దీక్షకు దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!

Thursday, September 10th, 2020, 01:39:13 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణ దీక్షను చేపట్టారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం అయిన ఘటనకు నిరసనగా పవన్ హైదరాబాద్‌లోని తన నివాసంలో ధర్మ పరిరక్షణ దీక్షకు దిగారు. అయితే ఈ రోజు నుంచి జనసేన, బీజేపీ సంయుక్తంగా ధర్మపరిరక్షణ దీక్షకు పిలుపునిచ్చాయి.

ప్రస్తుతం కరోనా నేపధ్యంలో కార్యకర్తలు ఎవరి ఇళ్లలో వారు నల్ల బ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లతో నిరసన తెలపాలని అటు జనసేన, బీజేపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇప్పటికే సీరియస్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ దీనిపై సమగ్ర విచారణ జరిపి వీలైనంత త్వరగా నింధితులను పట్టుకోవాలని లేదంటే ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతామంటూ హెచ్చరించారు.