జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై సీరియస్ అయ్యారు. జనసేన కార్యకర్త వెంగయ్య ఆత్మహత్యకు ఎమ్మెల్యే అన్నా రాంబాబే కారణమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డాడు. జనసేన పార్టీ తరపున వెంగయ్య కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులోనూ ఈ సారి అన్నా రాంబాబును చట్టసభల్లోకి వెళ్ళనివ్వమని అన్నారు.
అంతేకాదు 350 కోట్లు ఖర్చు పెట్టినా ఆయనను ఎమ్మెల్యే కాకుండా చూసుకునే బాధ్యత మాది అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ రోజు 11 గంటలకు వెంగయ్య కుటుంబ సభ్యులతో కలిసి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై పవన్ కళ్యాణ్ ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయనున్నారు.