చిరంజీవి రీఎంట్రీపై ఇప్పుడే చెప్పలేను.. క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

Saturday, January 30th, 2021, 02:00:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనే విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో కాపు సంక్షేమ సేన సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ప్రజారాజ్యం వ్యవస్థాపకుల్లో నేను ఒకడినని, చిరంజీవి రాజకీయ అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు.

అయితే చిరంజీవి నా మేలు కోరే వ్యక్తి అని అందులో డౌట్ లేదని అన్నారు. ఒక తమ్ముడుగా నేను ఎప్పుడూ విజయం సాధించాలనే ఆయన కోరుకుంటారని అయితే జనసేన పార్టీలో చిరంజీవి చేరతారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేనని, పరిస్థితులను బట్టి ఆయన చేరిక ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే పార్టీలో చేరడం, చేరకపోవడం చిరంజీవి అభిప్రాయమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.