రాజకీయాలు చేస్తూ సినిమాలు చేసుకుంటే తప్పా?

Monday, December 28th, 2020, 02:26:14 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడ పర్యటనలో ఉన్నారు. నివార్ బాధితులకు తక్షణ నష్ట పరిహారం అందజేయడం లో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ఇకనైనా మేల్కొని రైతులకు పరిహారం అందించాలనే డిమాండ్ తో చిత్తూరు జిల్లాలో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు జన సేన పార్టీ కి చెందిన నాయకులు. అయితే ఈ పర్యటన లో పవన్ కళ్యాణ్ తన పై విమర్శలు చేస్తున్న అధికార పార్టీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పేకాట క్లబ్బులు నిర్వహించే వైసీపీ నాయకులు రాజకీయాలు చేయొచ్చు కానీ, రాజకీయాలు చేస్తూ నేను సినిమాలు చేస్తే తప్పా అంటూ పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు.అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ఒక పక్క వరుస సినిమాలు చేస్తూనే మరో పక్క సినిమాలు చేయడం పట్ల పలువురు వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది.