దాడికి ప్రతిదాడి కావాలంటే జనసేన కార్యకర్తలు సిద్దం

Friday, December 4th, 2020, 03:28:24 PM IST

నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు. అయితే ఈ రైతుల సమస్యల తెలుసుకుంటూ పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో రెండో రోజు తమ పర్యటనను కొనసాగిస్తున్నారు. అయితే రైతు సమస్యల పై పోరాటం చేసేందుకు వచ్చిన జనసేనను వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోం అని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. భారీ వర్షం కురుస్తున్నా పవన్ రైతుల కోసం పర్యటించారు.

అయితే తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం 35 వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అయితే పోయ గ్రామం లో తనను అడ్డుకొనేందుకు ప్రయత్నించి న వైసీపీ నాయకుల తీరు పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా వైసీపీ జాగీర్ కాదు అని అన్నారు. రైతుల సమస్యల పై వారికి అండగా ఉండేందుకు ఎంతటి దూరం అయినా వెళ్తాం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బెదిరింపులకు భయపడే వ్యక్తి ను కాదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే జన సేన కార్యకర్తల పై దౌర్జన్యాలకి పాల్పడితే ప్రతి చర్యలు తీవ్రం గా ఉంటాయి అని, దాడికి ప్రతిదాడి కావాలంటే జన సేన కార్యకర్తలు సిద్దం అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.