ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు చేసి ప్రయోజనం ఏమిటి? – పవన్ కళ్యాణ్

Thursday, October 15th, 2020, 04:30:15 PM IST

విజయవాడ లో జరిగిన దివ్య తేజస్విని హత్య పై జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ను ఎండగడుతూ ఘాటు విమర్శలు చేశారు. విజయవాడ నగరం లో ఇంజినీరింగ్ విద్యార్థి దివ్య తేజస్విని ఓ ప్రేమోన్నాది చేతిలో బలైపోయింది అని తెలిసి ఎంతో బాధపడి నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే కొద్ది క్రితం విజయవాడ లోనే చిన్నారి అనే నర్స్ పై కూడా ఇలానే ప్రేమ వేదింపులు బారిన పడి మృతి చెందిన విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ కేంద్రం లో సేవ చేసే ఆ యువతి ను పెట్రోల్ పోసి హత్య చేశాడు అని, అది తెలిసి తీవ్ర ఆవేదనకు గురి అయ్యా అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అయితే ఆ మృతుల కుటుంబాలకు పవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి మరణం అత్యంత దారుణం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రం లో ఇలా వేదింపులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతుండటం దురదృష్టకరం అని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం ద్వారా ఏం సాధించింది అని సూటిగా పవన్ ప్రశ్నించారు. ఆడ బిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలను చేసి ప్రయోజనం ఏమిటి అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ దిశ చట్టం ప్రచారానికి తప్ప, పోలీస్ శాఖ స్పందన సరిగా లేదు అని పవన్ ఘాటు విమర్శలు చేశారు. అయితే కేసు తీసుకోకపోతే స్పందన ద్వారా ఫిర్యాదు చేసుకోవాల్సి వచ్చింది అని, పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించి మహిళల రక్షణ కోసం చట్టాన్ని బలంగా ప్రయోగించాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.