పవన్ పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి…ముగ్గురు మృతి…పవన్ దిగ్భ్రాంతి!

Tuesday, September 1st, 2020, 11:33:50 PM IST

Pawan_kalyan_Jagan

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో ముగ్గురు అభిమానులు ప్రాణాలను కోల్పోయారు. చిత్తూరు జిల్లా, కుప్పం లోని శాంతి పురం వద్ద అభిమానులు దాదాపు 25 అడుగుల భారీ కటౌట్ కట్టేప్పుడు విద్యుత్ షాక్ కి గురి అవ్వడం తో ముగ్గురు అభిమానులు ప్రాణాలను కోల్పోయారు. ఇదే ప్రమాదం లో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, ఇందులో నలుగురి పరిస్తితి విషమం గా ఉంది. ఆయితే మరణించిన వారి లో ఇద్దరు అన్నదమ్ములు ఉండటం ఆ ప్రాంతం లో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతులను సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం లు గా గుర్తించారు.

అయితే ఈ ఘటన పై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసైనికుల మరణం మాటలకు అందని విషాదం అని అన్నారు. ఈ ఘటన తన మనసుని బాగా కలచి వేసింది అని అన్నారు. తల్లి దండ్రుల గర్భ శోకం అర్దం చేసుకోగలను అని, వారికి దూరమైన కొడుకులను తిరిగి తీసుకురాలేను కనుక, ఆ తల్లదండ్రులకి తానే ఒక బిడ్డగా నిలిచేందుకు సిద్దం అయ్యారు. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకుంటా అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేకాక క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులకి సూచించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.