తేనెపట్టు కోసం అలా చేశారంటే చిన్నపిల్లలు కూడా నవ్వుతారు – పవన్ కళ్యాణ్

Wednesday, September 9th, 2020, 01:12:43 AM IST


తూర్పు గోదావరి జిల్లా లో అంతర్వేది నరసింహ స్వామి రథం దగ్ధం పై జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటన పై ఆంధ్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి తో విచారణ జరిపించాలి అని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సీబీఐ దర్యాప్తు కోసం కేంద్రాన్ని కొరతాం అని పవన్ పేర్కొన్నారు. అయితే రాష్ట్ర పోలీసుల పై నమ్మకం లేదు అన్న పవన్, పిఠాపురం, బిట్ర గుంట, అంతర్వేది ఘటనలు యాదృచ్ఛికం కావు అని తేల్చి చెప్పారు.

అయితే ఇలా ఎన్ని విగ్రహాల ద్వంసాలు, రథాల దహనాలు యాదృచ్ఛికంగా జరుగుతాయి అని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. అయితే అంతర్వేది ఘటన మతి స్థిమితం లేని వారి పని అని, తేనె పట్టు కోసం అలా చేశారంటే చిన్న పిల్లలు కూడా నవ్వుతారు అంటూ పవన్ ఘాటు విమర్శలు చేశారు. ఇతర మతాల పెద్దలు కూడా ఈ ఘటన ను ఖండించాలి అని పవన్ కోరారు. ఉనికి కోసమా, లేదంటే దేశం లో అస్థిరత కోసం ఎవరైనా చేస్తున్నారా అనే అంశం పై సమగ్ర విచారణ జరపాలి అని అన్నారు.