ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి – పవన్ కళ్యాణ్

Wednesday, December 9th, 2020, 11:00:13 PM IST

ఏలూరు ఘటన విషయం లో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది అని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జన సేన కి చెందిన ముగ్గురు సభ్యులు ఏలూరు లో తిరిగి నివేదిక ఇచ్చారు అని వివరించారు.అయితే కనీస వసతుల కల్పన లో ఉదాసీనత ఎందుకు అని జన సేన సూటిగా ప్రశ్నించారు. అయితే జిల్లా కేంద్రం లోని 500 పడకల ఆసుపత్రి లో న్యూరో ఫైజిషియన్ లేకపోవడం వంటి విషయాలు ఆవేదన కలిగిస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అందుకోసం విజయవాడ నుండి అయినా ఎందుకు రప్పించలేదు అని పవన్ ప్రశ్నించారు.

అయితే ఈ వ్యాధికి కలుషిత నీరు ఓ కారణంగా భావిస్తున్న తరుణంలో బాధిత ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీరు ను ఎందుకు సరఫరా చేయడం లేదు అని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందడం లేదు అని, విజయవాడ నుండి న్యురాలనిస్ట్ లని తరలించలేకపోవడం సిగ్గుచేటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కచ్చితంగా నిర్లక్షం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.