బిగ్ న్యూస్: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కి జనసేన మద్దతు

Friday, November 20th, 2020, 03:58:32 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మరింత రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెరాస మీద పక్కగా గెలవాలని భావిస్తున్న బీజేపీ కి జన సేన పార్టీ మద్దతు తోడు అయింది. ఈ ఎన్నికల్లో జన సేన పార్టీ పోటీ చేయడం లేదు అని, అభ్యర్దులు అందరూ కూడా బీజేపీ కి మద్దతు ఇవ్వాలి అని జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే జన సైనికులకి ఈ నిర్ణయం నిరాశ కలిగించవచ్చు అని, అయినా ఓటును విభజించాలని అనుకోవడం లేదు అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.

అయితే పవన్ కళ్యాణ్ బీజేపీ నేతల తో జరిగిన చర్చలో ఈ నిర్ణయం తీసుకోవడం తో తెలంగాణ లో జన సేన పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల అప్పుడే చర్చలు మొదలు అయ్యాయి. అయితే దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తో జోరు కనబరిచే విధంగా బీజేపీ దూసుకుపోయే అవకాశం ఉండటం తో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో పక్క తెరాస సైతం తమ సత్తా చాటేందుకు సమాయత్తం అవుతుంది.