రామతీర్ధం ఘటన జరిగి వారాలైనా పురోగతి లేదు – పవన్ కళ్యాణ్

Wednesday, January 13th, 2021, 05:24:11 PM IST

రామతీర్థం ఘటన జరిగి వారాలు గడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘటనపై దోషులను నిర్ధారించి దండించే వరకు బీజేపీతో కలిసి పోరాటం చేయటానికి నలుగురు సభ్యులతో కూడిన కమిటీనీ పవన కళ్యాణ్ నియమించారు. అయితే ఈ కమిటీకి పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ. టి.శివశంకర్ గారు నేతృత్వం వహించనున్నారు.

అయితే ఈ కమిటీలో సభ్యులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పాలవలస యశస్విని, పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు గడపాల అప్పారావు, డాక్టర్ బొడ్డెపల్లి రఘులను నియమించారు. అయితే రామతీర్థం ఘటన జరిగి వారాలు గడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదని, తమకు స్వేచ్చను ఇస్తే ఎలాంటి జఠిలమైన కేసునైనా గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తామని పోలీసు అధికారులు తరచూ ఆఫ్ ది రికార్డుగా చెబుతుంటారని, మరీ ఈ కేసులో పోలీసులకు పూర్తి స్థాయి స్వేచ్చను ఇవ్వలేదని అనుమానించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.