151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి ఏం లాభం – పవన్ కళ్యాణ్

Wednesday, January 6th, 2021, 06:39:29 PM IST

ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ అధికారంలొకై వచ్చిన ఈ రెండేళ్లలో వందకు పైగా ఆలయాలపై దాడులు జరిగాయని, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. అయితే దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురుంచి మాట్లాడితే ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తారా అని ప్రశ్నించారు.

అంతేకాదు సీఎం స్థాయిలో ఉండి జగన్ ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజలు నమ్మరని పవన్ కళ్యాణ్ అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 115 మంది ఐపీఎస్‌లు ఉన్నా దాడులకు పాల్పడుతున్న వారిని పట్టుకోకపోవడం నిజంగా విడ్డూరంగా ఉందని అన్నారు. అయితే దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురుంచి వాలంటీర్లు కూడా మీకు సమాచారం ఇవ్వలేకపోతున్నారా అని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేసిన దోషులను వెంటనే పట్టుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.