బిగ్ న్యూస్: బెదిరింపులతోనే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది – పవన్ కళ్యాణ్

Sunday, March 14th, 2021, 10:00:08 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు పట్ల జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెదిరింపుల తోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ స్థానాలు గెలిచింది అని సంచలన ఆరోపణలు చేశారు. ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపి వేస్తామని ప్రజలను బెదిరించారు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అయితే హైదరాబాద్ లో మీడియా సమావేశం ద్వారా మాట్లాడిన పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుండెల్లో భరోసా నింపి వైసీపీ ఓట్లు సాధించలేదు అని, కడుపుమీద కొట్టి తిండి లాక్కుంటాం అని బెదిరించి ఆ పార్టీ గెలిచింది అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మునిసిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ ఘోర ఓటమి చవి చూసింది.